Wed Jan 15 2025 09:57:27 GMT+0000 (Coordinated Universal Time)
ఓవైసీకి మహేశ్వర్ రెడ్డి సవాల్
నిర్మల్ సభకు రాకుండా ఉండేందుకు రూ.25 లక్షలు ఇస్తానని తాను చెప్పినట్లు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ చేసిన ఆరోపణలను నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖండించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మైనారిటీల ఓట్లు అడిగే దమ్ము లేక అసదుద్దిన్ ను తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సభలకు జనం రాకపోవడంతో ఓవైసీతో ఇంద్రకరణ్ రెడ్డి ఈ ఆరోపణలు చేయించారని ఆరోపించారు. తాను అసదుద్దిన్ కి డబ్బులు ఇస్తానని చెప్పినట్లు ఆధారాలు భయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని... అసదుద్దిన్ సిద్ధమా అని సవాల్ విసిరారు.
Next Story