Mon Dec 23 2024 03:35:01 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ కి నచ్చని బైక్ ఏదంటే?
రాహుల్ గాంధీకి డ్రైవింగ్ అంటే ఇష్టమే. కానీ బైక్ రైడింగ్ అంటే మహా ప్రీతి అట
రాహుల్ గాంధీ పుట్టుకతోనే సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయనకు యువకుడిగా ఎన్నో కోరికలుంటాయి. కానీ గాంధీ కుటుంబ వారసుడు కావడం, రాజకీయాల్లోకి రావడంతో ఆయనకు టైట్ సెక్యూరిటీ ఉంటుంది. తనకు ఇష్టమైన పనులు చేయడానికి వీలుండదు. ఎప్పుడైనా విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే తాను స్వేచ్ఛగా తన మనసులో ఉన్న కోరికలను తీర్చుకుంటారు. రాహుల్ గాంధీకి డ్రైవింగ్ అంటే ఇష్టమే. కానీ బైక్ రైడింగ్ అంటే మహా ప్రీతి అట. ఈ విషయాన్ని ఒక మీడియా సంస్థతో రాహుల్ గాంధీ పంచుకున్నారు.
అదంటే మహా ఇష్టం...
తనకు కారు లేదని, తల్లి సోనియా గాంధీ కారునే తాను అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తుంటానని తెలిపారు. కార్లు అంటే తనకు పెద్దగా ఆసక్తి లేదని రాహుల్ తెలిపారు. తనకు బైక్ డ్రైవింగ్ అంటే ఎక్కువ ఇష్టమని చెప్పారు. తన వద్ద ఒక బైక్ ఉందని కూడా రాహుల్ తెలిపారు. లండన్ లో ఉన్నప్పుడు తాను అప్రీలియా ఆర్ఎస్ 250ని వాడేవాడినని చెప్పుకొచ్చారు. అదంటే తనకు ఇష్టమని ఆయన చెప్పారు. అయితే ఓల్డ్ లాంబ్రెట్టా ఎంతో అందంగా ఉంటుందని రాహుల్ ముచ్చటపడ్డారు.
డ్రైవింగ్ చేయాలన్నా...
లాంబ్రెట్టా అందంగా ఉండటమే కాకుండా దానిని డ్రైవ్ చేయాలంటే ఎక్కువ శక్తి కావాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ రోడ్లపై బైక్ డ్రైవింగ్ చాలా ప్రమాదరకరమన్న రాహుల్ రాయల్ ఎన్ఫీల్డ్ తనకు నచ్చని బైక్ అని కుండబద్దలు కొట్టేశారు. అయితే దానిని ఎక్కువ మంది ఇష్టపడతారని అన్నారు. దీనికి బదులు ఆర్డీ 350ని తాను ఇష్టపడతానని రాహుల్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారత్ లో పెరగాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. తాను బైక్ రైడింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతానని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడటం లేదని ఆయన అన్నారు.
- Tags
- rahul gandhi
- bike
Next Story