బ్రేకింగ్: గాంధీ భవన్ లో తన్నుకున్న కాంగ్రెస్ నేతలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి మార్పు తెచ్చినట్లు కనిపించడం లేదు. పార్టీలో విభేదాలు తగ్గకపోగా పెరిగిపోయాయి. ఇవాళ గాంధీ భవన్ వేదికగా [more]
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి మార్పు తెచ్చినట్లు కనిపించడం లేదు. పార్టీలో విభేదాలు తగ్గకపోగా పెరిగిపోయాయి. ఇవాళ గాంధీ భవన్ వేదికగా [more]
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి మార్పు తెచ్చినట్లు కనిపించడం లేదు. పార్టీలో విభేదాలు తగ్గకపోగా పెరిగిపోయాయి. ఇవాళ గాంధీ భవన్ వేదికగా రెండు వర్గాలకు చెందిన నాయకులు బాహాబాహికి దిగి దాడులు చేసుకున్నారు. పార్టీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పూర్తి కాకముందే సీనియర్ నేత వీహెచ్ కి వ్యతిరేకంగా మరో ఓబీసీ నేత నూతి శ్రీకాంత్ కార్యకర్తలు నినాదాలు చేశారు. వీహెచ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో శ్రీకాంత్ కు అంబర్ పేట టిక్కెట్ రాకపోవడానికి వీహెచ్ కారణమని ఆరోపించారు. దీంతో రెండు వర్గాలకు చెందిన నేతలు కుర్చీలు విసురుకున్నారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇదంగా భట్టి విక్రమార్క ముందే జరిగింది. దీంతో గన్ మెన్లు ఆయనను పక్కకు తీసుకెళ్లారు.