Sun Nov 24 2024 18:39:15 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ క్యారెక్టరే మంచిది కాదు.. కేసీఆర్ కు సీరియస్ అని చెప్పాడు
తనది కాంగ్రెస్ తో పంచాయతీ కాదని, రేవంత్ రెడ్డితోనే సమస్య అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు
తనది కాంగ్రెస్ తో పంచాయతీ కాదని, రేవంత్ రెడ్డితోనే సమస్య అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారన్నారు. తనపై మాత్రమే కాదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులను కూడా డ్యామేజీ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డితో కలసి పనిచేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదని అనేకసార్లు చెప్పానని అన్నారు. తాను టీఆర్ఎస్ లో చేరినట్లు ఫొటోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారన్నారు. ఉన్నది ఉన్నది చెప్పడం తనకు అలవాటని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై అభిమానంతోనే కొనసాగుతున్నానని చెప్పారు.
మెదక్ కు వెళుతూ....
ఇరవై రోజుల క్రితం తనకు రేవంత్ రెడ్డి ఫోన్ చేశారని, మెదక్ చర్చికి వెళుతున్నట్లు చెప్పారన్నారు. తాను రేవంత్ కోసం వెయిట్ చేస్తుంటే తనను కలవకుండానే మెదక్ వెళ్లారన్నారు. తాను దీనిపై నిలదీయడం తప్పెలా అవుతుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తాను తక్కువ సమయంలో కాంగ్రెస్ లో ఎదిగానని చెప్పారు. తన పట్ల రేవంత్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నన్ను కెలికితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునన్నారు.
కేసీఆర్ కు సీరియస్ గా ఉందని.....
రేవంత్ రెడ్డి తనను సీఎల్పీ గదిలోకి తీసుకెళ్లారని, కేసీఆర్ కు ఏమైనా జరగొచ్చని, సీరియస్ గా ఉందని, కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని తనతో చెప్పారన్నారు. మనం అప్రమత్తంగా ఉండాలని రేవంత్ తనతో చెప్పారన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఆ పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువయ్యాయన్నారు. కానీ బయట చూసిన మీడియా తనను బుజ్జగించడానికి గదిలోకి తీసుకెళ్లాడని భావించి ఉండవచ్చన్నారు. తనతో ఉన్న వివాదాల విషయం ఏమీ మాట్లాడలేదన్నారు. కేసీఆర్ ఆరోగ్యంపైనే మాట్లాడరన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు సరిగా ట్రైనింగ్ ఇవ్వలేదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రేవంత్ వి అన్నీ చీప్ పాలిటిక్స్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నానని జగ్గారెడ్డి చెప్పారు.
Next Story