Mon Dec 23 2024 02:08:09 GMT+0000 (Coordinated Universal Time)
దిగ్విజయ్ సింగ్ అరెస్ట్ తో?
బెంగుళూరు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఒక హోటల్ లో మధ్యప్రదేశ్ కు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు [more]
బెంగుళూరు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఒక హోటల్ లో మధ్యప్రదేశ్ కు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు [more]
బెంగుళూరు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఒక హోటల్ లో మధ్యప్రదేశ్ కు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని కలిసేందుకు దిగ్విజయ్ సింగ్ వచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలసి ఆ హోటల్ వద్దకు చేరుకున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడాలని అనుకుంటున్నారని, అందుకే తాను వచ్చానని చెప్పారు. వారి ఫోన్లు స్విచాఫ్ చేసి ఉండటంతో తాను బెంగళూరుకు వచ్చానని, తనను హోటల్ లోకి అనుమతించాలని కోరారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఆయన హోటల్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story