మహాకూటమి పార్టీలకు కాంగ్రెస్ షాక్
మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలకు నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఒప్పందం చేసుకున్న స్థానాలకు మించి అభ్యర్థులకు బీఫాం లు ఇచ్చింది. వాస్తవానికి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేయాల్సి ది. అయితే, 99 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులకు బీఫాం లు ఇచ్చింది. హుజురాబాద్ నుంచి పాడి కౌశీక్ రెడ్డికి, పటాన్ చెరు నుంచి శ్రీనివాస్ గౌడ్ కి, ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డికి, దుబ్బాక నుంచి మద్దుల నాగేశ్వరావు, వరంగల్ ఈస్ట్ నుంచి వద్దిరాజు రవిచంద్రలకు ఇవాళ బీఫాంలు ఇచ్చారు. వీటిల్లో పటాన్ చెరు స్థానం టీడీపీకి కేటాయించాల్సి ఉంది. ఇక ఇబ్రహీంపట్నం నుంచి ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిగా సామ రంగారెడ్డిని ప్రకటించింది. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్ రెడ్డి రంగారెడ్డికి బీఫాం ఇచ్చారు. ఇక వరంగల్ ఈస్ట్, దుబ్బా స్థానాలు టీజేఎస్ కి కేటాయించగా వీటిల్లోనూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెడుతుంది. దీంతో టీడీపీ, టీజేఎస్ కి కాంగ్రెస్ షాక్ ఇచ్చినట్లయింది.