నిబంధనలు కఠినతరం చేయండి.. హైకోర్టు ఆదేశం
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. టెస్టుల సంఖ్య, వ్యాక్సిన్, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవదానికి తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం నివేదికను సమర్పించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు భారీగా [more]

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. టెస్టుల సంఖ్య, వ్యాక్సిన్, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవదానికి తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం నివేదికను సమర్పించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు భారీగా పెంచాలని హైకోర్టు ఆదేశించింది. సేరో సర్వేలెన్స్ సర్వే ప్రారంభించామని ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్పింది. లిక్కర్ షాపులు, పబ్స్, క్లబ్స్, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్ పై ఆంక్షలు విధించాలని హైకోర్టు పేర్కొంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంటేనే రాష్ట్రంలో కి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. డిజాస్టర్ యాక్టు ప్రకారం నిపుణుల తో అడ్వైజరీ కమిటీ వేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కేంద్రం చెప్పిన విదంగా 100 మంది ఉన్న కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ చేయాలని, మాస్కులు, భౌతిక దూరంపై నమోదైన కేసులు చాలా తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడింది. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.