బ్రేకింగ్ : ఏపీలో కొంత తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఏపీలో 48 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 2100కు చేరుకుంది. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. గత కొద్దిరోజులుగా ఏపీలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లే కన్పిస్తుంది. ముఖ్యంగా లాక్ డౌన్ నిబంధనల్లో మినహాయింపులు ఇచ్చాక కొంత పరిస్థితి కంట్రోల్ లోనే ఉండటం పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 15 కేసులు అధికంగా నమోదయ్యాయి. కొత్తగా నమోదయిన 36 కేసుల్లో 21 కేసులు కోయంబేడు మార్కెట్ కు వెళ్లివచ్చిన వారే కావడం విశేషం.