Mon Dec 23 2024 01:30:26 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ మహారాష్ట్రలో కోవిడ్ ఆంక్షలు
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. రోజుకు ఐదు వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో కరోనా నిబంధనలను [more]
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. రోజుకు ఐదు వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో కరోనా నిబంధనలను [more]
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. రోజుకు ఐదు వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో కరోనా నిబంధనలను కఠిన తరం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హోటళ్లలో యాభై శాతం మంది కస్టమర్లకు మాత్రమే అనుమతించాలని, అంత్యక్రియలకు ఇరవై మంది మాత్రమే హాజరవ్వాలని ఆదేశించింది. ముంబయి, నాగపూర్, పూనా నగరాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేసింది. ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో అక్కడ లాక్ డౌన్ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
Next Story