బర్త్ డే పార్టీలో కరోనా అంటుకుంది
హైదరాబాద్ లోని ఓ వజ్రాల వ్యాపారి ఇచ్చిన బర్త్ డే పార్టీతో అనేక మందికి కరోనా వైరస్ అంటుకుంది. ఇద్దరు మృత్యువాత పడగా మరో ఇద్దరు సీరియస్ [more]
హైదరాబాద్ లోని ఓ వజ్రాల వ్యాపారి ఇచ్చిన బర్త్ డే పార్టీతో అనేక మందికి కరోనా వైరస్ అంటుకుంది. ఇద్దరు మృత్యువాత పడగా మరో ఇద్దరు సీరియస్ [more]
హైదరాబాద్ లోని ఓ వజ్రాల వ్యాపారి ఇచ్చిన బర్త్ డే పార్టీతో అనేక మందికి కరోనా వైరస్ అంటుకుంది. ఇద్దరు మృత్యువాత పడగా మరో ఇద్దరు సీరియస్ గా ఉన్నారు . మొత్తం బర్త్ డే పార్టీ కి హాజరైన వారిలో 12 మంది కి కరోనా సోకినట్లు గా తేలింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబరు ఆరు లో జరిగింది. గ్రాండ్ గా 150 మందికి వజ్రాల వ్యాపారి బర్త్ డే పార్టీని ఇచ్చాడు. ఈ పార్టీకి వచ్చిన వారిలో పుర ప్రముఖులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీకి వచ్చి ఎంజాయ్ చేశారు. పార్టీకి వచ్చిన వారిలో ఇద్దరికీ ముందస్తుగా కరోనా సోకింది. ఆ తర్వాత 12 మంది కి కరోనా వచ్చింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బర్త్ డే పార్టీ కొంప ముంచిందని స్థానికంగా ఉన్న జిహెచ్ఎంసి అధికారులు చెప్తున్నారు.