Huzurabad : 22 రౌండ్లు.. లెక్కింపు సాయంత్రం వరకూ…?
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. తొలుత తమకు అందరి 753 పోస్టల్ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. తొలుత తమకు అందరి 753 పోస్టల్ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. తొలుత తమకు అందరి 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 22 రౌండ్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు. తొలి రౌండ్ ఫలితం 9 గంటల తర్వాత మాత్రమే వచ్చే అవకాశముంది.
ఇద్దరి మధ్యే…
హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈటల రాజేందర్ , గెల్లు శ్రీనివాస్ ల మధ్య హోరా హోరీ పోరు జరిగింది. ఎగ్జిట్ పోల్స్ సయితం తక్కువ శాతం ఓట్లతో బయటపడతారని చెప్పడంతో రెండు పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. ఈ ఎన్నిక ఫలితం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.