Sat Nov 23 2024 04:02:37 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : జగన్కు మళ్లీ ఝలక్.. ఆ ఇద్దరూ ఎవరు?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వైసీపీ ఊహించినట్లుగా క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో సునాయాసంగా టీడీపీ గెలిచింది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచేందుకు గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారు. మంత్రులకు ఎమ్మెల్యేల వారీగా బాధ్యతలను అప్పగించారు. అందరు ఎమ్మెల్యేలు విధిగా హాజరై వారికి కేటాయించిన అభ్యర్థికి ఓట్లు పడేలా చూసుకున్నారు. 175 ఓట్లు చెల్లినట్లు అధికారులు ప్రకటించడంతో ఒక టెన్షన్ తీరింది.
మాక్ పోలింగ్...
రెండు రోజుల పాటు మాక్ పోలింగ్ ను కూడా నిర్వహించారు. ఏ అభ్యర్థికి ఎవరు ఓటు వేయాలన్న దానిపై ప్రతి ఎమ్మెల్యేకు స్పష్టత ఉంది. నెలిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు తన కుమారుడి వివాహం నిమిత్తం అక్కడే ఉండిపోయినా చివరి నిమిషంలో అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కోసం స్పెషల్ ఫ్లైట్ ను ఏర్పాటు చేసింది. దీంతో వైసీీపీ పకడ్బందీగా రచించిన వ్యూహం సక్సెస్ అయిందనే చెప్పాలి. టీడీపీ ఓడినా పెద్దగా నష్టపోయేదేమీ లేదు. అదే గెలిస్తే ఎన్నికలకు ముందు వైసీపీ హైకమాండ్ కు తలనొప్పగా మారనుంది. అందుకే ఈ ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుపొందారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ అంచనాలు తప్పాయి. మూడింటిని కోల్పావాల్సి వచ్చింది. అందుకే అసంతృప్తిగా ఉన్నారని భావించిన ఎమ్మెల్యేలతో జగన్ నేరుగా మాట్లాడినట్లు తెలిసింది. వారి నియోజకవర్గ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి వారిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే కోటా కింద అన్ని సామాజికవర్గాల వారికీ అభ్యర్థులుగా జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. చివరి నిమిషం వరకూ ఉత్కంఠగా సాగింది. చంద్రబాబు వ్యూహం ఫలించింది. పంచుమర్తి అనూరాధ కు ఎవరు ఆ ఇద్దరూ ఓటు వేశారన్న దానిపై చర్చ మొదలయింది.
- Tags
- mlc election
- tdp
Next Story