లాక్ డౌన్ తర్వాత లెక్క పక్కాగా లేకపోతే?
తెలంగాణ లో మద్యం షాపుల్లో లిక్కర్ లెక్క మిస్సవుతుంది. లాక్ డౌన్ కు ముందు రోజు ఉన్న లిక్కర్ లెక్క ఇప్పుడు సరిపోవడం లేదు. లిక్కర్ షాపులకు [more]
తెలంగాణ లో మద్యం షాపుల్లో లిక్కర్ లెక్క మిస్సవుతుంది. లాక్ డౌన్ కు ముందు రోజు ఉన్న లిక్కర్ లెక్క ఇప్పుడు సరిపోవడం లేదు. లిక్కర్ షాపులకు [more]
తెలంగాణ లో మద్యం షాపుల్లో లిక్కర్ లెక్క మిస్సవుతుంది. లాక్ డౌన్ కు ముందు రోజు ఉన్న లిక్కర్ లెక్క ఇప్పుడు సరిపోవడం లేదు. లిక్కర్ షాపులకు గత పదిహేను రోజుల నుంచి ఉన్న తాళాలు వేసి ఉన్నప్పటికీ లోపల ఉన్న లిక్కర్ మాయమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కు ముందు రోజు ఏ షాపులో ఎంత స్టాక్ ఉందీ ఎక్సైజ్ శాఖ లెక్క రాసి పెట్టింది. అయితే రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఈ లిక్కర్ మాయమయినట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే దీనిపై 78 కేసులు నమోదయినట్లు సమచారం. ఎనిమిది షాపుల్లో మాత్రం దొంగతనాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. వాటిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీల్ చేసి ఉన్న వైన్స్ మరియు బార్ల నుంచి కూడా లిక్కర్ మాయమయినట్లు ఎక్పైజ్ అధికారులు గుర్తించారు. లాక్ డౌన్ తర్వాత లెక్క తేలుస్తామని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. లెక్కల్లో తేడా వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తోంది.