Mon Dec 23 2024 10:54:23 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రిషబ్ పంత్ కు ప్రమాదం
ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి రూర్కీ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది
ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి రూర్కీ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారులో మంటలకు చెలరేగాయి.
డివైడర్ ను ఢీకొని...
రిషబ్ పంత్ రూర్కీ వస్తుండగా డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు సగ భాగం దగ్దమైంది. రిషబ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల శ్రీలంక సిరీస్ కు రిషబ్ పంత్ ఎంపిక కాలేదు. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ఇండియా టీంలో రిషబ్ పంత్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
Next Story