నోట్ల కట్టలు రోడ్డెక్కుతున్నాయ్.....!
నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీల నేతలు డబ్బులు కుమ్మరిస్తుంటారు. తెలంగాణ లో రెండు చోట్ల దొరికిన డబ్బుల పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ రెండు చోట్ల దొరికిన డబ్బులు కూడా రాజకీయ పార్టీలకు చెందిన వారివేగా పోలీసులు అనుమానిస్తున్నారు. పదికోట్లకు సంబంధించిన వారు ఎవరో తెలియడం లేదు. ఈ డబ్బులకు అసలైన యాజమాని కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అసలు డబ్బులు ఎవరివి..?
ఎన్నికల్లో పంచడానికేనా?
ఎన్నికల నగరా మోగిన వెంటనే నోట్ల కట్టలు రోడ్డెక్కాయి. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే నోట్ల కట్టలు దొరకడం మొదలైంది. ఒక వైపు మోడల్ కొడ్ ను ఎన్నికల కమిషన్ అమలుపరుస్తుంటే మరొక వైపు సికింద్రాబాద్ లో కోటి రూపాయల పైచిలుకు డబ్బులు దొరకడం సంచలనం రెకెత్తించింది. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పొతుందో అధికారులు సైతం సరిగా చెప్పలేక పొతున్నారు. గుజరాత్ నుంచి నగరానికి వస్తుందని అధికారులు చెబుతుంటే అసలు దీని చివరి లబ్ది దారుడు ఎవరు అన్న విషయం ఇప్పటి వరకు పోలీసులు కూడా చెప్పలేక పొతున్నారు. ఒక్కటి మాత్రం అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఈ గుజరాత్ గ్యాంగ్ హవాలా డబ్బులను హైదరబాద్ కు తీసుకుని వస్తున్నారని అంటున్నారు.గతంలో తెచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చారు? వారం రొజుల క్రితం తెచ్చిన కోటి రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలను అధికారులు వెతికే ప్రయత్నంలో వున్నారు. బేగం బజార్ లోని ఎవరి వద్దకు ఈ కోటి రూపాయల వెళుతున్నాయి. ఈ మీస్టరీని ఇప్పటి వరకు అధికారులు తేల్చ లేక పోతున్నారు.
తెలుగు యుువత నేత.....
ఇకపొతే హైదరాబాద్ నగరంలో నాలుగు రోజుల క్రితం దొరికిన అరవై లక్షల వ్యవహారం కూడా సంచలనం రేకెత్తిస్తోంది.ఎందుకంటే తెలుగు యువత వైస్ ప్రెసిడెండ్ అయిన వల్లభనేని అనిల్ కూమార్ కు చెందిన డ్రైవర్ మహెష్ ను పట్టుకొవడంతో ఈ హవాలా మనీ విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. హైదరబాద్ నుంచి జగిత్యాలకు ఈ అరవై లక్షల రూపాయలను రవాణా చేస్తుంటే టాస్క్ పొర్స్ పోలీసులు దీనిని పట్టుకున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న అధికారి పార్టీకి చెందిన తెలుగు యువత నేత అనిల్ కూమార్ నే డైరెక్ట్ గా ఈ డబ్బు వెనకాల వుండడంతో ఇప్పడు రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. హైదరాబాద్ లోని ఒక షొరూం నుంచి ఈ డబ్బులను జగిత్యాలకు అనిల్ కూమార్ తన డ్రైవర్ తో పంపిస్తున్నాడని పోలీసులు అంటున్నారు. అయితే ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో పంచడానికి పంపిస్తున్నారని రాజకీయ పార్టీలు అంటున్నాయి. అయితే అనిల్ మాత్రం ఇందులో పది లక్షల రూపాయల మాత్రమే తనవని, మిగిలిన డబ్బులు తనవి కావాని అంటున్నారు. అయితే తనవి కాని డబ్బులను అనిల్ డ్రైవర్ ఎందుకు తీసుకుని పొతున్నాడన్నదే ప్రశ్న. ఎందుకంటే అనిల్ డ్రైవర్ ను పోలీసులు విచారించినప్పడు ఈ డబ్బులను తన బాస్ జగిత్యాలలో ఇవ్వమని చెప్పాడని తెలిపారు. అయితే ఎవరికి పంపిస్తున్నాడో మాత్రం విషయం ఖచ్చితంగా మాత్రం తెలియరాలేదు. మరొక వైపు ఐటి అధికారులు అనిల్ కు నోటీసులు ఇచ్చారు. ఈ డబ్బులు విషయం తేల్చాలని తెలిపారు. అయితే సొమవారం రోజున అనిల్ ఐటి అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. అనిల్ ఏం చెబుతారో.. ?అసలు ఏం జరుగుతుందో అన్నది మీస్టరీగా ఉంది.
పదికోట్లు ఎక్కడివి...?
ఇకపొతే ఆదిలాబాద్ జిల్లాలో దొరికిన పది కోట్ల వ్యవహారం ఇప్పడు రాష్ట్ర రాజకీయలను కుదిపేస్తుంది. ఎందుకంటే ఈ డబ్బులు ఆదిలాబాద్ జిల్లాల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి తీసుకుని పోతున్నారని పోలీసు వర్గాలు అంటున్నాయి.. అయితే డబ్బులు పట్టుకుని పొతున్న ఇద్దరు మాత్రం ఇది బెంగుళురు నుంచి నాగపూర్ కు డబ్బులను తీసుకుని వెళ్లుతున్నామని చెబుతున్నారు. బెంగుళురులోని వ్యాపారి ఈ డబ్బులను నాగపూర్ కు పంపిస్తున్నారని పోలీసులకు చిక్కిన ఆ ఇద్దరు వ్యక్తులు చెబుతున్నారు.అయితే సదరు వ్యాపారి అనే వ్యక్తి ఎవరో? ఏంటో? కూడా తెలియని స్దితి నెలకొని వుంది. ఎందుకంటే సదరు వ్యక్తి తెలిసిన పక్షంలో నోటీసులు ఇచ్చి హాజరుపరుస్తామని పోలీసులు అంటున్నారు. అయితే ఈ డబ్బులు పంపిస్తున్న వ్యక్తి ఎవరో? ఏంటో తెలియని స్దితి. ఇదిలా వుంటే పది కోట్లు పంపిస్తున్న సదరు వ్యాపారి ఈ డబ్బులు తమవే అంటూ పోలీసులను ఆశ్రయించలేదు. మరొక వైపు నాగపూర్ లో వున్న వ్యక్తి కూడా ఈ పదికోట్ల రూపాయల కొసం రాలేదు.
హైదరాబాద్ టు ఆదిలాబాద్......
డబ్బులు తీసుకుని పోతూ పోలీసులకు చిక్కిన వ్యక్తులు కూడా సరియైన సమాధానం చెప్పడం లేదు. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇక పొతే ఈ పదికోట్లు డబ్బులపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పొతున్నాయి? ఎవరు పంపుతున్నారన్న కోణంలో కూడా విచారణ మొదలైంది. ఈ పది కోట్లు హైదరబాద్ నుంచే ఆదిలాబాద్ కు వెళ్లుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.. హైదరబాద్ లో వున్న వ్యక్తులు ఎవరు అన్న కోణంలో కూడా విచారణ మొదలైంది. ఈ పది కోట్లు కూడా రాజకీయ ఆవసరాల కోసమే వెళుతున్నాయని పోలీసుల అనుమానం. ఇప్పటి కే మూడు బృందాలను హైదరాబాద్, బెంగుళూరు. నాగపూర్ లకు పంపించారు.ఈ బృందాలు విచారణ ఆరంభించిన పక్షంలో అన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం వుంది. పది కోట్లు తీసుకువెళుతున్న చిట్ట చివర లబ్ది దారుడు ఎవరు అన్న విషయాన్ని త్వరలోనే తేలుస్తామని పోలీసులు అంటున్నారు.