ఈసీ అనుమతితోనే కేబినెట్ మీటింగ్
ఎన్నికల కోడ్ ఉన్నా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుండటంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. కేబినెట్ సమావేశానికి సంబంధించి సీఎంఓ నుంచి నోట్ [more]
ఎన్నికల కోడ్ ఉన్నా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుండటంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. కేబినెట్ సమావేశానికి సంబంధించి సీఎంఓ నుంచి నోట్ [more]
ఎన్నికల కోడ్ ఉన్నా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుండటంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. కేబినెట్ సమావేశానికి సంబంధించి సీఎంఓ నుంచి నోట్ వచ్చిందని, అయితే ఏయే అంశాలపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలని కోరినట్లు ఆయన తెలిపారు. కేబినెట్ అజెండా ఎంటో చెబితూ ఎన్నికల సంఘానికి పంపిస్తామని తెలిపారు. అజెండా పరిశీలించేందుకు 48 గంటల సమయం పట్టవచ్చని తెలిపారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నాకే కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను ముఖ్యమంత్రికి వివరించాలని సీఎంఓకు సూచించానని ఆయన తెలిపారు.