లోకల్ నాన్ లోకల్ ఏంటి?
కళాకారులు యూనివర్సల్ అని, వారికి లోకల్, నాన్ లోకల్ అని అంటగడతారేంటి అని సినీనటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ అధ్యక్షుడిగా పోట ీచేస్తున్న [more]
కళాకారులు యూనివర్సల్ అని, వారికి లోకల్, నాన్ లోకల్ అని అంటగడతారేంటి అని సినీనటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ అధ్యక్షుడిగా పోట ీచేస్తున్న [more]
కళాకారులు యూనివర్సల్ అని, వారికి లోకల్, నాన్ లోకల్ అని అంటగడతారేంటి అని సినీనటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ అధ్యక్షుడిగా పోట ీచేస్తున్న ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. మీడియా ని చూస్తే భయం వేస్తోందన్నారు. మీడియా చేసే హడావుడి వల్ల ఇక్కడి నేతలే కాదు అమెరికా అధ్యక్షుడుబిడెన్ కూడా వస్తాడేమో అని భయం వేసిందని ప్రకాష్ రాజ్ చమత్కరించారు. తాము మా ఎన్నికల్లో పాల్గొనాలని ఏడాది నుంచి కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఇందులోకి చిరంజీవిని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. పెద్దలంతా అందరికీ కావాల్సిన వాళ్లేనని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. త్వరగా ఎన్నికలు జరపాలని ఆయన కోరారు. తమ ప్యానెల్ లో గట్టిగా మాట్లాడే వారున్నారని, తాను తప్పు చేసినా బయటకు పంపిస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించారు.
1. ప్రకాష్‌రాజ్
2. జయసుధ
3. శ్రీకాంత్
4. బెనర్జీ
5. సాయికుమార్
6. తనీష్
7. ప్రగతి
8. అనసూయ
9. సన
10. అనిత చౌదరి
11. సుధ
12. అజయ్
13. నాగినీడు
14. బ్రహ్మాజీ
15. రవిప్రకాష్
16. సమీర్
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్
20. శివారెడ్డి
21. భూపాల్
22. టార్జాన్
23. సురేష్ కొండేటి
24. ఖయ్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవిందరావు
27. శ్రీధర్‌రావు