వాళ్లు దాడి చేయడంతోనే…?
నిందితులు నలుగురు పోలీసులపై దాడి చేయడంతోనే తాము ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. తాము విచారణలో భాగంగా దిశ ఉపయోగించిన ఫోన్ [more]
నిందితులు నలుగురు పోలీసులపై దాడి చేయడంతోనే తాము ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. తాము విచారణలో భాగంగా దిశ ఉపయోగించిన ఫోన్ [more]
నిందితులు నలుగురు పోలీసులపై దాడి చేయడంతోనే తాము ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. తాము విచారణలో భాగంగా దిశ ఉపయోగించిన ఫోన్ ను దాచిపెట్టిన చోటును చూపించాల్సిందిగా నిందితులను కోరామని, వారిని ఇక్కడికి తీసుకొచ్చి విచారణ చేస్తున్న సమయంలోనే పోలీసులపై నలుగురు నిందితులు తిరగబడ్డారన్నారు సజ్జనార్. కొన్ని వస్తువల రికవరీ కోసమే వారిని సంఘటన స్థలానికి తీసుకొచ్చామని తెలిపారు.
రాళ్ల దాడికి దిగడంతోనే….
పోలీసులపై రాళ్ల దాడికి దిగారన్నారు. తమ వద్ద ఉన్న ఆయుధాలను లాక్కుని కాల్పులు జరిపారన్నారు. ప్రధాన నిందితులు మహ్మద్ ఆరిఫ్, చెన్న కేశవులు తమ పోలీసు సిబ్బందిపై దాడి చేయడంతోనే కాల్పుుల జరపాల్సి వచ్చిందన్నారు. కాల్పులు ఆపాలని, లొంగిపోవాలని పదే పదే పోలీసులు కోరినా వారు వినలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. దిశ హత్యకేసులో నిందితులు నలుగురు ఈ కాల్పుల్లో మృతి చెందారని సజ్జనార్ తెలిపారు. నిందితులు నలుగురూ గతంలో నేరాలు చేసినట్లు తమకు అనుకూలంగా ఉందన్నారు. తాము అనేక కోణాల్లో విచారణ చేశామని, నిందితులు పోలీసులపై కాల్పులు జరపడం వల్లనే తాము కూడా కాల్పులకు దిగాల్సి వచ్చిందన్నారు. ఈ దాడిలో ఎస్సై, కానిస్టేబుల్ గాయపడ్డారని సజ్జనార్ తెలిపారు. ఈరోజు ఉదయం 5.45 నుంచి 6గంటల మధ్యలోనే ఈ ఘటన జరిగిందని సజ్జనార్ తెలిపారు.