డీఎస్ కు దారి దొరికింది..!
గత రెండు నెలలుగా సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ రాజకీయంగా అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సహా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలంతా తీర్మాణం చేసి కేసీఆర్ కు పంపారు. తర్వాత కేసీఆర్ డి.శ్రీనివాస్ ను కలవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ, డి.శ్రీనివాస్ పై చర్యలు తీసుకోకున్నా పూర్తిగా పక్కన పెట్టేశారు.
ఈనెల 11వ తేదీన......
దీంతో రెండు నెలలుగా డి.శ్రీనివాస్ రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో డి.శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కొందరు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినా చివరకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన సెప్టెంబర్ 11వ తేదీన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని, అనుచరులను కూడా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లనున్నారు. కాంగ్రెస్ లోకి చేరే సందర్భంగా డీఎస్ టీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేస్తారో చూడాల్సి ఉంది.