Mon Dec 23 2024 16:14:06 GMT+0000 (Coordinated Universal Time)
RRR మూవీ విడుదల ఎప్పుడంటే?
కరోనా కారణంగా ఒకసారి వాయిదా పడిన RRR ను విడుదల చేసేందుకు తేదీలను రెడీ చేశారు.
పాన్ ఇండియా మూవీ RRR రిలీజ్ కు సిద్ధమయింది. కరోనా కారణంగా ఒకసారి వాయిదా పడిన RRR ను విడుదల చేసేందుకు తేదీలను రెడీ చేశారు. మార్చి 18వ తేదీ కాని ఏప్రిల్ 28వ తేదీన విడుదలయ్యే అవకాశముందని తెలుస్తుంది. మూవీ మేకర్స్ ఈ రెండు తేదీలను పరిశీలిస్తున్నారు.
వాయిదా వేయడంతో....
కరోనా థర్డ్ వేవ్ దేశంలో ఉధృతంగా ఉండటంతో అనేక రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలను విధించాయి. అనేక రాష్ట్రాల్లో థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీని విధించారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సినిమా హాళ్లను పూర్తిగా మూసివేశారు. ఢిల్లీలో కూడా అంతే. దీంతో RRR టీం సినిమాను వాయిదా వేయడంతో చరణ్, తారక్ అభిమానులకు నిరాశ ఎదురయింది. అయితే తాజాగా RRR మూవీ మేకర్స్ రెండు తేదీలను రెడీ చేసి పెట్టుకున్నారు. ఈ రెండింటిలో ఒకటిని ఫైనల్ చేయనున్నారు. థియేటర్లు పూర్తి సామర్థ్యంతో నడిస్తే మార్చి 18న లేకుంటే 28వ తేదీన మూవీని విడుదల చేయనున్నారు.
Next Story