Mon Dec 23 2024 00:16:39 GMT+0000 (Coordinated Universal Time)
మృతుల సంఖ్య వేలల్లోనే
టర్కీ, సిరియాల్లో భూకంపానికి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం 2,316లకు మృతుల సంఖ్య చేరింది
టర్కీ, సిరియాల్లో భూకంపానికి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం 2,316లకు మృతుల సంఖ్య చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వేలాది మంది భవనాల శిధిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మూడు సార్లు భూకంపం రావడంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. నిన్న తెల్లవారు జామును వచ్చిన భూకంపానికే ఎక్కువ మంది మరణించారని టర్కీ అధికారులు చెబుతున్నారు.
సాయం చేసేందుకు...
సహాయక చర్యలను ప్రారంభించారు. భవనాలు కూలిపోవడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకూ మృతదేహాలను బయటపడుతుండటంతో హృదయ విదారకరమైన దృశ్యం కనపడుతుంది. మరొక పక్క మంచుకురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రపంచ దేశాలు కూడా టర్కీ, సిరియా దేశాలకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి.
సహాయక చర్యలు...
భారత్ ఇప్పటికే మెడిసిన్స్ తో పాటు వైద్య బృందాలను పంపింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు డీఆర్ఎఫ్ బృందాలను కూడా భారత్ సిరియాకు పంపింది. యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా స్పందించాయి. నెదర్లాండ్స్ , రొమేనియా వంటి యూరప్ దేశాలు సహాయక బృందాలను సిరియా, టర్కీలకు పంపాయి. మరింత సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ యూనియన్ తెలిపింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
- Tags
- death toll
- turkey
Next Story