ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారే..!
కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఈసారి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి. గత అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎదురుకాని ప్రతిఘటన [more]
కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఈసారి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి. గత అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎదురుకాని ప్రతిఘటన [more]
కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఈసారి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి. గత అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎదురుకాని ప్రతిఘటన ఈసారి ఎదురవుతోంది. అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం పార్టీ ఉనికి, సీఎల్పీ మనుగడే ప్రశ్నార్థకం కావడంతో సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి ఓటేసిన ఓటర్లు అవమానించారనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
మోసం చేశారని ఫిర్యాదు చేస్తున్న కార్యకర్తలు
ఇక, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైతం భట్టి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇవాళ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ప్రజల్లోకి వెళుతున్న ఎమ్మెల్యేలకు నిరసనలు ఎదురవుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు హరిప్రియనాయక్, రేగా కాంతారావును కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు నిలదీసిన విషయం తెలిసిందే. మొత్తానికి గత అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలలా పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో దర్జాగా ఉందామనుకున్న ఈ ఎమ్మెల్యేలు ప్రతిఘటనలు, ఫిర్యాదులతో నైతికంగా ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కుంటున్నారు.