అడ్డుకుంటే ఉరిశిక్ష తప్పదు
ఆస్పత్రులకు ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరాను కేంద్ర, రాష్ట్ర [more]
ఆస్పత్రులకు ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరాను కేంద్ర, రాష్ట్ర [more]
ఆస్పత్రులకు ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నట్లు తెలిస్తే ఉరిశిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికైనా ఇదే శిక్ష అని స్పష్టం చేసింది. ఆక్సిజన్ కొరతపై మహారాజ అగ్రసేన్ ఆస్పత్రి దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్పై స్పందించిన కేంద్రం.. ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సమన్వయంతో ఆక్సిజన్ కొరతను అధిగమిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం 24 గంటలు పని చేస్తున్నామని ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రం నియమించిన నోడల్ అధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా దిల్లీలో ఆక్సిజన్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.