సీఐడీపై దేవినేని సంచలన ఆరోపణలు
చంద్రబాబు పేరు చెప్పాలని తనపై వత్తిడి తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ సీఐడీపై సంచలన ఆరోపణలు చేశారు. అనేక మంది టీడీపీ నేతలను భవిష్యత్ లో [more]
చంద్రబాబు పేరు చెప్పాలని తనపై వత్తిడి తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ సీఐడీపై సంచలన ఆరోపణలు చేశారు. అనేక మంది టీడీపీ నేతలను భవిష్యత్ లో [more]
చంద్రబాబు పేరు చెప్పాలని తనపై వత్తిడి తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ సీఐడీపై సంచలన ఆరోపణలు చేశారు. అనేక మంది టీడీపీ నేతలను భవిష్యత్ లో అరెస్ట్ చేసే అవకాశముందన్నారు. చంద్రబాబు పేరు చెబితే మధ్యాహ్నమే పంపించి వేస్తామని చెప్పినట్లు ఆయన మీడియాకు వివరించారు. తనపై ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని దేవినేని ఉమ అన్నారు. ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులను జగన్ సందర్శించకుండా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారని దేవినేని ఉమ విమర్శించారు. కరోనా భయంతో అసెంబ్లీ సమావేశాలను రద్దు చేసిన జగన్, పరీక్షలను ఎందుకు రద్దు చేయడంలేదో చెప్పాలని దేవినేని ఉమ ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఏపీలో అస్తవ్యస్తంగా మారిందన్నారు. తనపై తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా తాను ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటానని దేవినేని ఉమ తెలిపారు. మే 1వ తేదీన తిరిగి హాజరు కావాలని సీఐడీ అధికారులు చెప్పారన్నారు.