Mon Dec 23 2024 10:30:39 GMT+0000 (Coordinated Universal Time)
ముందుచూపు, ప్రణాళిక లేకపోవడంతోనే?
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు పోవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముందుచూపు, ప్రణాళిక లేకపోవడం కారణంగానే [more]
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు పోవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముందుచూపు, ప్రణాళిక లేకపోవడం కారణంగానే [more]
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు పోవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముందుచూపు, ప్రణాళిక లేకపోవడం కారణంగానే కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయని దేవినేని ఉమ అభిప్రాయపడ్డారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న ప్రభుత్వం ఈ మరణాలకు బాధ్యత తీసుకుంటుందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
Next Story