Sun Nov 24 2024 05:31:24 GMT+0000 (Coordinated Universal Time)
ధోనీతో చెప్పులు తొడిగిస్తారా..?
టీమిండియా స్టార్ క్రికెటర్ ఎం.ఎస్.ధోనీ భార్య సాక్షి చేసిన పని సోషల్ మీడియాలో పెద్దచర్చకు తెరతీసింది. సాక్షికి ధోనీ చెప్పులు తొడుగుతుండగా తీసిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. చెప్పులు నువ్వే కొనిచ్చావ్... నువ్వే తొడుగు అని ఆమె ఓ కాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ధోనీ వంటి గొప్ప ఆటగాడితో చెప్పులు తొడిగిస్తావా అని కొందరు ధోనీ విరాభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సాక్షి చర్యపై కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు ధోని-సాక్షి ప్రేమకు పలువురు మాత్రం కితాబిస్తున్నారు. ధోనీ ఏమాత్రం గర్వం లేకుండా భార్య చెప్పులు తొడగడాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు.
Next Story