Mon Nov 25 2024 08:26:00 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు కూడా ఎండలే ఎండలు
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావం తో తొమ్మిది మండలాల్లో తీవ్రవడగాల్పులు వీస్తాయని పేర్కొంది. 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది.
నిన్న ఇక్కడ...
నిన్న నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 46.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణాల్లో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ కోరింది.
నేడు ఇక్కడ...
ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది•
Next Story