కరీంనగర్ లో అక్కడ ఆంక్షలు తొలగింపు
ఇండోనేషి యన్లు పర్యటించిన కరీంనగర్ లోని ముకరంపుర ప్రాంతంలో రేపటి నుంచి దశలవారీగా ఆంక్షలు తొలగించనున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ముకరంపుర ప్రాంతంలో ఇప్పటివరకు నో [more]
ఇండోనేషి యన్లు పర్యటించిన కరీంనగర్ లోని ముకరంపుర ప్రాంతంలో రేపటి నుంచి దశలవారీగా ఆంక్షలు తొలగించనున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ముకరంపుర ప్రాంతంలో ఇప్పటివరకు నో [more]
ఇండోనేషి యన్లు పర్యటించిన కరీంనగర్ లోని ముకరంపుర ప్రాంతంలో రేపటి నుంచి దశలవారీగా ఆంక్షలు తొలగించనున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ముకరంపుర ప్రాంతంలో ఇప్పటివరకు నో ఎంట్రీ జోన్ లో ఉంది. ఇందులో ఉన్న ఆంక్షలను పాక్షికంగా సడలిస్తూ శనివారం నాలుగు గేట్లు తెరవనున్నట్లు వెల్లడించారు.శనివారం ఉదయం నాలుగు గంటలపాటు గేట్లు తొలగిస్తామని, ఎల్లుండి నుంచి రోజుకో గంట చొప్పున పెంచుతూ పూర్తి సడలింపు చేశామని కలెక్టర్ ఒక ప్రకటనలో ప్రకటించారు. తొలగించిన గేట్ల వద్ద వైద్య బృందాలు ఉండి అక్కడి నుంచి వెళ్లి వచ్చే వారిని ఎప్పటికప్పుడు పరిక్షిస్తారు. ఇంకా ఎవరైనా కరోనా అనుమానితులు ఉన్నట్లయితే స్వచ్చందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఆంక్షల సడలింపు సందర్బంలో నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు, మందులు లాంటి వాటికోసం మాత్రమే బయటకు రావాలన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ కోరారు.