Mon Dec 23 2024 14:21:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అంబేద్కర్ విగ్రహావిష్కరణ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ట్యాంక్‌బండ్ సమీపంలో ఏర్పాటు చేశారు. కొత్త సచివాలయానికి సమీపంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ట్యాంక్‌బండ్‌కు మరో ప్రత్యేకత సంతరించుకుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరు కానున్నారు ఆయన నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
దాదాపు 125 అడుగుల ఈ భారీ కాంస్య విగ్రహాన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, తెలుగుతల్లి జంక్షన్ వద్ద రాకపోకలను నిలిపేశారు. ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
146 కోట్ల వ్యయంతో...
అంబేద్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు ఉంటుంది. కింద పార్లమెంటు ఆకారంలో వేదికను నిర్మించి దానిపై విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వచ్చే పర్యాటకులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈరోజు అంబేద్కర్ జయంతి కావడంతో దానిని ఆవిష్కరించాలని నిర్ణయించారు. 2016లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి నుంచి పనులు ప్రారంభించి ఇప్పటికి పూర్తయింది. ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం మొత్తం 146 కోట్ల రూపాయలు వ్యయం చేశారు.
Next Story