Fri Nov 22 2024 20:11:12 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలో మూడు రోజులు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలో మూడు రోజులు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని కూడా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
అన్ని శాఖలు...
ప్రజలతో సంబంధాలుండే అన్ని శాఖలు నిరంతరం పనిచేసే విధంగా చూడాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్యయంతో పని చేయాలన్నారు. అంందుకు అనుగుణంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని, విద్యుత్తు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పోలీసు, విద్య, వైద్య శాఖలు నిరంరం అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో అధికారులను ఆదేశించారు. రోడ్లపై జనసంచారాన్ని తగ్గించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను కోరారు.
అవసరమైతే తప్ప....
ఎగువ గోదావరి నుంచి వరద ముంచుకొస్తున్నందున ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల్లో రెస్క్యూ టీంలను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట హెలికాప్టర్ లను వినియోగించాలని కోరరు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఆ సమాచారాన్ని సత్వరం అందచేయాలన్నారు. పురాతన భవనాలను గుర్తించి అందులో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు.
Next Story