పవన్ కు ద్వారంపూడి కౌంటర్
ఇన్నాళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ ను కొందరు తప్పుడు సమాచారాన్ని [more]
ఇన్నాళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ ను కొందరు తప్పుడు సమాచారాన్ని [more]
ఇన్నాళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ ను కొందరు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారన్నారు. జనసేన కార్యకర్తలు తన ఇంటిపైనే దాడికి దిగారన్నారు. వాళ్లు ధర్నా చేయాల్సిన ప్రాంతమేంది? నా ఇల్లు ఎక్కడ? అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. కాకినాడలో శాంతిభద్రతలను నాశనం చేసింది జనసేన మాత్రమేనని తెలిపారు. చంద్రబాబుతో కలసి పవన్ కల్యాణ్ రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని కుట్రపన్నారన్నారు. మా అధినేత జగన్ ఒక్క మాటంటే తాము రెండు మాటలు అంటామని ద్వారంపూడి హెచ్చరించారు. ఇంగ్లీష్, ఇసుక, అమరావతి అంటూ పవన్ కల్యాణ్, చంద్రబాబు అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వాళ్లు తమ అధినేతను తిట్టినందుకే తాను ఆ భాష వాడాల్సి వచ్చిందన్నారు.