ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలు
లోక్ సభలో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ… ఈబీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి అన్ని పార్టీలూ [more]
లోక్ సభలో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ… ఈబీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి అన్ని పార్టీలూ [more]
లోక్ సభలో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ… ఈబీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి అన్ని పార్టీలూ మేనిఫెస్టోలో ఇప్పటికే పెట్టాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సైతం వారి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిందని గుర్తు చేశారు. తర్వాత ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్, శివసేన, బీజేడీ, టీఆర్ఎస్ పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. ఈ బిల్లు నాస్ కావాలంటే లోక్ సభలో మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు ఇవ్వాలి. మెజారిటీ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడంతో లోక్ సభలో బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది.