బ్రేకింగ్: రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఓటుకు నోటు కేసులో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో [more]
ఓటుకు నోటు కేసులో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో [more]
ఓటుకు నోటు కేసులో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ నెల 19న ఈడీ ముందు రేవంత్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి టీడీపీ నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏసీబీ ఓటుకు నోటు కేసు నమోదు చేసింది. అయితే, ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇచ్చిన రూ.50 లక్షలు, ఇస్తామని చెప్పిన రూ.4.5 కోట్లకు సంబంధించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈడీ విచారణ జరుపుతోంది. ఇవాళ కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కీర్తన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. బ్యాంక్ స్టేట్ మెంట్లు, ఏసీబీ ఇచ్చిన ఆధారాలతో ఈడీ విచారణ జరుపుతోంది.