Sun Dec 22 2024 23:24:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సీఎంగా ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకు బీజేపీ అంగీకరించింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేయనున్నారు. షిండే ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. షిండే ప్రభుత్వానికి బీజేపీ బయటనుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. రాత్రి 7.30 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేయనున్నారు. రెబల్స్ కే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముందుకు వచ్చింది.
హిందుత్వ అజెండా కోసమే...
హిందుత్వ అజెండా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని షిండే తెలిపారు. బాల్ థాక్రే ఆశయాలను తాను కొనసాగిస్తానని షిండే చెప్పారు. సిద్ధాంతపరంగా బీజేపీ తాము ఒక్కటేనని షిండే తెలిపారు. హిందుత్వ అజెండా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యత తమదేనని బీజేపీ చెప్పింది. ప్రభుత్వాన్ని కూలదోశామన్న అపవాదు రాకుండా షిండేకు సీఎం పదవి అ్పగించాలని నిర్ణయించింది.
Next Story