Sun Jan 12 2025 05:30:47 GMT+0000 (Coordinated Universal Time)
హరీష్ రావుపై ఎన్నికల సంఘం సీరియస్
నిబంధనలకు విరుద్ధంగా కుల సంఘాలతో సమావేశమయ్యారనే ఆరోపణలతో టీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇటీవల ఆర్యవైశ్య సంఘం సమావేశంలో ఆయనను సన్మానించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫోటోలు, సీడీలతో సహా ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం హరీష్ రావు నిబంధనలు ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Next Story