Sun Dec 22 2024 23:28:27 GMT+0000 (Coordinated Universal Time)
అంబానీ చిన్న కొడుకు కోసం కొత్త ఇల్లు.. ఎక్కడంటే?
ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ దుబాయ్ లో కొత్త ఇల్లును కొనుగోలు చేశారు
ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ దుబాయ్ లో కొత్త ఇల్లును కొనుగోలు చేశారు. దీని విలువ 640 కోట్ల రూపాయలు పైనే. దుబాయ్ సముద్ర తీరంలో ఈ విల్లా ఉంది. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం ఈ విల్లాను ముఖేష్ కొనుగోలు చేసినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఆధునిక సౌకర్యాలున్న ఈ ఇల్లు విలాసవంతమైనది మాత్రమే కాకుండా దుబాయ్ లో అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ ఇదేనని బ్లూమ్ బర్గ్ పేర్కొంది.
అత్యాధుని సౌకర్యాలతో...
దుబాయ్ లోని పామ్ జుమైరాలో ఈ విల్లా ఉంది. అయితే ఈ విల్లా కొనుగోలుకు సంబంధించి అంబానీ కుటుంబం రహస్యంగా ఉంచారు. దుబాయ్ స్థానిక పత్రికల్లో అంబానీ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా భారత బిలియనీర్ అని పేర్కొన్నారు. రిలయన్స్ ఆఫ్ షోర్ సంస్థల్లో ఒకటి ఈ ఇంటి కొనుగోలును జరిపినట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. ఈ విల్లాలో మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు ఇంకా అంబానీ కుటుంబం ఖర్చు చేస్తూనే ఉంది.
ప్రయివేటు బీచ్ కూడా...
మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ విల్లాలో పది పడక గదులు ఉన్నాయని అంటున్నారు. ఇక ఇండోర్, అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్స్ మాత్రమే కాకుండా ప్రయివేటు బీచ్ కూడా ఉంది. దీని పొడవు 70 మీటర్లు. ప్రయివేట్ స్పాట్ కూడా ఉంది. చిన్న కుమారుడు వివాహం అనంతరం ఈ విల్లాలో గడుపుతారని చెబుతున్నారు. ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ముఖేష్ అంబానీకి ఇల్లు ఉంది. 27 అంతస్థుల భవనం అది. దీంతో పాటు ఇటీవల లండన్ లోని బకింగ్‌హాం షైర్ వద్ద 300 ఎకరాల్లో ఇక భవనాన్ని కొనుగోలు చేశారు. దీనివిలు 590 కోట్ల పైమాటేనని అప్పట్లో వార్తలొచ్చాయి.
Next Story