జ్యోతి – బాబు పై మండిపడుతున్న ఉద్యోగులు
ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఉద్యోగులను కించపరిచేలా, అవమానించేలా అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని [more]
ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఉద్యోగులను కించపరిచేలా, అవమానించేలా అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని [more]
ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఉద్యోగులను కించపరిచేలా, అవమానించేలా అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఉద్యోగులను ఉద్దేశించి ‘ఆ నా కొడుకులు’ అంటూ చంద్రబాబుతో రాధాకృష్ణ మాట్లాడిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఉద్యోగ సంఘం నేత వెంకట్ రాంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనునిత్యం కష్టపడుతున్న ఉద్యోగుల గురించి తన ముందే రాధాకృష్ణ అసభ్యంగా మాట్లాడితే చంద్రబాబు సమర్థించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడుతున్న రాధాకృష్ణ తన పత్రికకు, ఛానల్ కు ప్రకటనల రూపంలో వేల కోట్లు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో కూడా ఆంధ్రజ్యోతిలో ఉద్యోగుల పట్ల ద్వేషపూరిత కథనాలు ప్రచురించిందన్నారు. అసలు ఉద్యోగులపై అసభ్యంగా మాట్లాడేందుకు రాధాకృష్ణకు అంత బలుపు ఎందుకని ప్రశ్నించారు. రాధాకృష్ణ తన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆంధ్రజ్యోతి పత్రకను, ఛానల్ ను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.