Andhra : పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల నిరసన
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. తాము ఎన్నాళ్ల నుంచో [more]
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. తాము ఎన్నాళ్ల నుంచో [more]
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. తాము ఎన్నాళ్ల నుంచో డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలంటూ సచివాలయం రెండో బ్లాక్ వద్ద ఉద్యోగ సంఘాల నేతలు బైఠాయించారు.
సీఎస్ కోసం….
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉద్యోగ సంఘాలు వెళ్లిపోవాలని కోరుతన్నారన్నారు. దీంతో పీఆర్సీ నివేదికపై మాట్లాడేందుకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ హుటాహుటిన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. సీఎస్ రాక కోసం ఉద్యోగ సంఘాల నేతలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇస్తామని గతంలో సీఎం హామీ ఇచ్చారు.