Mon Dec 23 2024 07:34:22 GMT+0000 (Coordinated Universal Time)
నామాతో మొదలు.. మలి రైడ్ ఎవరిపైనో?
నామా నాగేశ్వరరావుకు చెందిన కంపెనీ ఆస్తులను అటాచ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఫ్లెక్సీల వివాదం, రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించడం.. ఆయనకు ఘన స్వాగతం పలకడం.. మరో వైపు పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు. ఒకదానితో ఒకటిని వేరు చేసి చూడలేం. ఇక నామా నాగేశ్వరరావుతో మొదలయింది. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల పై ఈడీ, ఐటీ దాడులు షురూ కానున్నాయన్న చర్చ అధికార టీఆర్ఎస్ పార్టీలో మొందలయింది.
నిర్మాణ రంగంలో...
నామా నాగేశ్వరరావు రాజకీయాల్లోకి రాకముందే మధుకాన్ కంపెనీని స్థాపించారు. కంపెనీని లాభాల బాట పట్టించారు. అనేక కనస్ట్రక్షన్ పనులను చేపట్టారు. దేశ వ్యాప్తంగా అనేకచోట్ల రోడ్లు, భవనాలు పనులు చేపట్టిన మధుకాన్ కంపెనీకి మంచిపేరే ఉంది. అయితే ఎంపీగా ఎన్నికయిన తర్వాత ఆయన డైరెక్టర్ పదవి నుంచి తప్పు కున్నారు. వారి కుటుంబ సభ్యులు అందులో డైరెక్టర్లుగా ఉన్నారు.
92 కోట్ల ఆస్తులు...
అయితే నామా నాగేశ్వరరావుకు చెందిన కంపెనీ ఆస్తులను అటాచ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది మధుకాన్ గ్రూపులకు సంబంధించి అనేక పనులు చేపట్టింది. అందులో భాగంగా రాంచీలో ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించింది. ఈ ప్రాజెక్టుకోసం రుణాలు తీసుకు్నా వాటిని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు గతంలోనే ఉన్నాయి. 2002 లో ఈడీ కేసు నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన 92 కోట్ల విలువైన ఆస్తులను ప్రస్తుతం అటాచ్ చేసింది. మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా ఈడీ జాబితాలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది.
Next Story