Mon Dec 23 2024 10:23:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జేసీ ఇంట్లో ఈడీ సోదాలు
అనంతపురం తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
అనంతపురం తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ లన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో జేసీ సోదరులు ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం. జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు గోపాల్ రెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది.
బయట ఆందోళన...
అయితే అందిన సమాచారం మేరకు ఈడీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేస్తుండటంతో ఆయన అనుచరులు బయట ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కి చెందిన హైదరాబాద్ నివాసంలోనూ ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story