Mon Dec 23 2024 11:13:43 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన ఆస్తులను అటాచ్ చేశారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. 22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. జేసీ అనుచరుడు గోపాల్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.
గోపాలర్ రెడ్డి ఆస్తులను...
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ, ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డి ఇంట్లోనూ ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఎస్ 4 వాహనాలను రిజిస్ట్రేషన్లు చేయించి విక్రయించిన కేసులో ఈడీ దర్యాప్తు చేసింది. దీనిపై సోదాలు జరిపిన ఈడీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు జేసీ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story