బ్రేకింగ్ : ఎవరికి భయపడే జాతి కాదు నాది
కొన్ని ఛానల్స్ లో ముందస్తు ప్రణాళికతో స్కెచ్ వేసుకుని తన క్యారెక్టర్ ను చంపేందుకు ప్రయత్నం జరగుతుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాను అసైన్డ్ భూములను [more]
కొన్ని ఛానల్స్ లో ముందస్తు ప్రణాళికతో స్కెచ్ వేసుకుని తన క్యారెక్టర్ ను చంపేందుకు ప్రయత్నం జరగుతుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాను అసైన్డ్ భూములను [more]
కొన్ని ఛానల్స్ లో ముందస్తు ప్రణాళికతో స్కెచ్ వేసుకుని తన క్యారెక్టర్ ను చంపేందుకు ప్రయత్నం జరగుతుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాను అసైన్డ్ భూములను కబ్జా చేశారంటూ వరస కథనాలను ప్రసారం చేశారన్నారు. ఇన్విస్టిగేషన్ చేయాలి కాని, ఒకేసారి అన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేయడం సిగ్గు చేటని అన్నారు. న్యాయం తాత్కాలికంగా అపజయం పాలు కావచ్చని, ఇటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ఈటల రాజేందర్ తెలిపారు.
తనకు 2004కు ముందే…?
తాను 2016లో పెద్ద యెత్తున హాచరీ పెట్టాలని భావించామన్నారు. జమున హేచరీస్ ను అచ్చంపల్లి, హకీంపేట గ్రామాల్లో పెట్టామన్నారు. 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని చెప్పారు. తర్వాత విస్తరణ కోసం మరో 40 ఎకరాలను కొనుగోలు చేశామన్నారు. కెనరా బ్యాంకు నుంచి వంద కోట్ల రుణం తీసుకున్నామని ఈటల రాజేందర్ తెలిపారు. చుట్టుపక్కల అసైన్డ్ భూములు ఉండటంతో అధికారులను అడిగానని, ముఖ్యమంత్రికి కూడా చెప్పానని ఈటల అన్నారు. రాళ్లు రప్పలతో కూడిన అసైన్డ్ భూమిని తాను తీసుకోవాలని భావించానని ఈటల రాజేందర్ తెలిపారు. ఒక్క ఎకరం కూడా అసైన్డ్ భూమి తాను స్వాధీనం చేసుకోలేదని, ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని ఈటల రాజేందర్ తెలిపారు. 1986 నుంచి తనకు కోళ్ల ఫారం బిజినెస్ ఉందన్నారు. 2004 కు ముందే తనకు 120 ఎకరాల భూమి ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. తాను ఆత్మగౌరవాన్ని నమ్ముకున్నా నన్నారు. తాను భయపడే వ్యక్తిని కానన్నారు. తన మొత్తం ఆస్తులపై విచారణ జరపాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వేసిన విచారణను ఈటల రాజేందర్ స్వాగతించారు. చిల్లరమల్లర బెదిరింపులకు లొంగిపోనని తెలిపారు. పదవుల కోసం తలొగ్గనని ఈటల రాజేందర్ తెలిపారు. ఎటువంటి విచారణకయినా తాను సిద్ధమని ఈటల రాజేందర్ ప్రకటించారు.