Mon Dec 23 2024 14:18:51 GMT+0000 (Coordinated Universal Time)
సో.. ఆ దూరం మెయిన్ టెయిన్ చేయాల్సిందేనా?
తెలుగుదేశం పార్టీ లో యాక్టివ్ గా లేని నేతల్లో భూమా అఖిలప్రియ ఒకరు. ఆమె ఆళ్లగడ్డకే పరిమితమయ్యారు.
ఎందుకో మరి.. తెలుగుదేశం పార్టీ లో యాక్టివ్ గా లేని నేతల్లో భూమా అఖిలప్రియ ఒకరు. పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొంటున్నా ఆమె ఆళ్లగడ్డకే పరిమితమయ్యారు. తాను మాజీ మంత్రిని అన్న విషయాన్ని మర్చిపోయారు. పార్టీ అధినాయకత్వంతో భూమా అఖిలప్రియకు బాగా గ్యాప్ వచ్చినట్లు కనపడుతుంది. గత ఏడాది కాలంగా ఆమె చంద్రబాబును కలవలేదు. కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదు.
ఏడాది కాలంగా...
చంద్రబాబు ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యాలయాలపై దాడులు జరిగాయని 36 గంటల దీక్ష చేస్తే అమరావతికి రాలేదు. కానీ తన నియోజకవర్గంలో టీడీపీ పక్షాన ఆందోళన నిర్వహించారు. అలాగే చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్ కు దాడికి దిగినట్లు వార్తలు వచ్చినా భూమా అఖిలప్రియ స్పందించలేదు. ఇక చంద్రబాబు తన భార్య భువనేశ్వరిని అసెంబ్లీలో తూలనాడారని కన్నీళ్లు పెట్టుకున్నా అఖిలప్రియ రియాక్ట్ కాలేదు.
గ్యాప్ పెరిగిందట...
పార్టీ అధినాయకత్వంతో భూమా అఖిలప్రియకు బాగా దూరం పెరిగినట్లు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇందుకు రెండు కారణాలు. తాను హైదరాబాద్ లో ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయితే చంద్రబాబు కానీ, పార్టీ కాని తనకు అండగా నిలవలేదన్న ఆక్రోశం భూమా అఖిలప్రియలో కన్పిస్తుంది. అలాగే చంద్రబాబు ఏపీలో అరెస్టయిన వారిని ఇంటికి వెళ్లి ఓదార్చి వచ్చారు. కానీ తన విషయంలో పట్టించుకోలేదన్న ఆగ్రహంతో భూమా అఖిలప్రియ ఉన్నారు.
టిక్కెట్ల విషయంలోనూ...
దీంతో పాటు తన కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కేవలం ఒక స్థానం మాత్రమే కేటాయిస్తానన్న సంకేతాలు పంపడం కూడా కోపానికి కారణమంటున్నారు. ఆళ్లగడ్డ ఒక్కటే భూమా కుటుంబానికి దక్కుతుందట. నంద్యాల ముస్లింలకు గాని, భూమా కుటుంబానికి కాకుండా వేరే బలమైన కుటుంబానికి ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారన్న ఉప్పందడంతో భూమా అఖిలప్రియ తనంతట తానే దూరంగా ఉంటున్నారట. టిక్కెట్లపై క్లారిటీ తెచ్చుకునేందుకే ఆళ్లగడ్డ నియోజకవర్గానికే పరిమితమై అక్కడ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Next Story