Thu Jan 16 2025 04:49:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి
కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో జరుగుతున్న జగన్ పాదయాత్రలో ఆయన పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... సీనియర్ నేత అయిన రామచంద్రయ్య పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆయన అనుభవం పార్టీ అభ్యున్నతికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని రామచంద్రయ్య పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం చారిత్రక అవసరం అన్నారు.
Next Story