Fri Feb 28 2025 06:05:40 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర ఎన్నికల కమిషన్ కు గోనె లేఖ
కేంద్ర ఎన్నికల కమిషన్ కు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు లేఖ రాశారు. హుజూరాబాద్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ [more]
కేంద్ర ఎన్నికల కమిషన్ కు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు లేఖ రాశారు. హుజూరాబాద్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ [more]

కేంద్ర ఎన్నికల కమిషన్ కు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు లేఖ రాశారు. హుజూరాబాద్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ లో కోట్లు ఖర్చు చేస్తుందని గోనె ప్రకాశరావు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్ అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. దీంతోపాటు మాట వినని వారిపై అక్రమ కేసులు బనాయిస్తుందని కూడా గోనె ప్రకాశరావు ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న ఖర్చుపై నిఘా పెట్టాలని సూచించారు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే అధికార పార్టీ ఆగడాలను ఆపలేమని గోనె ప్రకాశరావు తన లేఖలో పేర్కొన్నారు.
Next Story