Wed Dec 25 2024 13:17:09 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో మాజీ ఎమ్మెల్యే చేరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు బమ్మిడి నారాయణస్వామి వై.ఎస్.జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణస్వామి విలువలతో రాజకీయాల్లో కొనసాగారనే పేరుంది. ఆచార్య ఎన్జీ రంగా, గౌతు లచ్చన్నలకు ఆయన ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. తర్వాత రాజకీయాల్లో అంత క్రియాశీలంగా లేరు. టెక్కిలిలో పాదయాత్రలో ఉన్న జగన్ ను ఆయన కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ... రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో జగన్ నడుస్తున్నందునే ఆయన పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
Next Story