ఎగ్జిట్ పోల్స్ దెబ్బ… ప్రమాదంలో కాంగ్రెస్ సర్కార్
మరోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ ప్రమాదంలో పడింది. అత్తెసరు మెజారిటీతో నడుస్తున్న ఈ ప్రభుత్వం మైనారిటీలో [more]
మరోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ ప్రమాదంలో పడింది. అత్తెసరు మెజారిటీతో నడుస్తున్న ఈ ప్రభుత్వం మైనారిటీలో [more]
మరోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ ప్రమాదంలో పడింది. అత్తెసరు మెజారిటీతో నడుస్తున్న ఈ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ గవర్నర్ కు లేఖ రాసింది. దీంతో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ షాక్ కు గురైంది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చర్యలతో జాగ్రత్త పడుతోంది.
ఇద్దరు ఎమ్మెల్యేలు వెళితే…
230 అసెంబ్లీ సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 116 స్థానాలు ఉండాలి. దీంతో కాంగ్రెస్ కు బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎస్పీకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కు కేవలం మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక ఎమ్మెల్యే మాత్రమే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగడం కష్టంగానే ఉంది.