గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ దే.. ఎగ్జిట్ పోల్స్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ తిరిగి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారంలోకి వస్తుందని తేలింది. [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ తిరిగి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారంలోకి వస్తుందని తేలింది. [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ తిరిగి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారంలోకి వస్తుందని తేలింది. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ కు 68 నుంచి 78 స్థానాలు వస్తాయని తేలింది. టీఆర్ఎస్ ఓట్ల శాతం 38 శాతంగా ఉండనుంది. అలాగే మ్యాజిక్ ఫిగర్ 76 స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. బీజేపీకి 25 నుంచి 35 స్థానాలు వచ్చే అవకాశముంది. బీజేపీ ఓట్ల శాతం 32 గా ఉండనుంది. ఎంఐఎం 38 నుంచి 42 స్థానాలు దక్కించుకోనుంది. కాంగ్రెస్ కు ఒకటి నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓట్ల శాతం 15 గా ఉంది. ఇతరులు ఐదు స్థానాలు దక్కించుకుంటారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.