Wed Dec 04 2024 19:01:34 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : భయపెడుతున్న భూకంపాలు.. తెలుగు రాష్ట్రాలకు ప్రమాదం ఎంత?
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రం భూకంపాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భూ కంపాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రం భూకంపాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సేఫ్ జోన్ లోనే ఉన్నాయని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈరోజు 7గంటల 27 నిమిషాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా భూకంపాలపై చర్చ జరుగుతుంది. రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతగా నమోదయింది. ఇదే సమయంలో ములుగు సమీపంలో ఈ భూకంప కేంద్ర నలభై కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ములుగు జిల్లాలో వేల చెట్లు పడిపోయిన ప్రాంతంలో భూంకప కేంద్రం ఉన్నట్లు కనుగొన్నారు.
కొన్ని సెకన్ల పాటు...
భద్రాచలంలో 1967లో భూ ప్రకంపనలు వచ్చాయి. అప్పుడు రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతగా నమోదయింది. మళ్లీ ఇన్ని దశాబ్దాల తర్వాత తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే భూమిలో జరిగే మార్పులతో ఇవి సర్వ సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సెకన్ల పాటు మాత్రమే భూమి కంపించడంతో కొందరు అసలు భూ ప్రకంపనలు వచ్చాయన్న విషయం కూడా గుర్తించలేకపోయారు. కొందరు మాత్రం ఇళ్లలోని వస్తువులు పడి పోవడంతో దానిని భూకంపంగా భావించి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
జోన్ 2లో ఉన్నాయని...
అయితే రెండు తెలుగు రాష్ట్రాలు భూకంపాల విషయంలో సురక్షిత ప్రదేశంలోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంత తీవ్రత గతంలో ఎన్నడూ రాకపోవడంతో కొంత ఆందోళన కలగడం సహజమేనని, అయితే దీనికి కంగారు పడాల్సిన పనిలేదని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు జోన్ 2లో సురక్షితమైన ప్రదేశంలోనే ఉన్నాయని, ఇక్కడ భూకంపాలు కానీ, భూ ప్రకంపనలు కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషిస్తున్నారు. పెద్దగా ఆందోళన చెంది ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన పనిలేదని, ఇది సాధారణంగా జరిగే విషయమేనని అంటున్నారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను మాత్రం షేక్ చేస్తున్నాయి.
Next Story