ఫడ్నవిస్ మా నేత
మహరాష్ట్రలో రాజకీయం గంట గంటకూ వేడెక్కుతోంది. దేవంద్ర ఫడ్నవిస్ ను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శివసేనకు బీజేపీ ఆఫర్ ప్రకటించింది. [more]
మహరాష్ట్రలో రాజకీయం గంట గంటకూ వేడెక్కుతోంది. దేవంద్ర ఫడ్నవిస్ ను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శివసేనకు బీజేపీ ఆఫర్ ప్రకటించింది. [more]
మహరాష్ట్రలో రాజకీయం గంట గంటకూ వేడెక్కుతోంది. దేవంద్ర ఫడ్నవిస్ ను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శివసేనకు బీజేపీ ఆఫర్ ప్రకటించింది. డిప్యూటీ సీఎంతో పాటు 13 మందికి మంత్రి పదవులు ఇస్తామనిచెప్పింది. సీఎంతో సహా 26 మంది మంత్రులుగా బీజేపీ వారే ఉంటారని పేర్కొంది. తమతోకలసి రావాలని శివసేనను బీజేపీ కోరింది. అయితే ఫడ్నవిస్ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన రెండు, మూడురోజుల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బల నిరూపణకు సమయం ఉండటంతో అప్పుడు శివసేనతో లోతుగా చర్చించవచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.